Download DishTV App to Avail App Only Cashback Offers, One-Tap Recharge & Lot More!
Recharge, Manage your Account & Explore Exciting Offers!
close
DTH India, Digital TV, DTH Services| Dish TV
  • తక్షణ రీఛార్జ్

  • New Connection కొత్త కనెక్షన్
  • Need Help సహాయం పొందండి
  • My Account లాగిన్ అవ్వండి
    My Account మై అకౌంట్
    Manage Your Packs మీ ప్యాక్‌లను నిర్వహించండి
    Self Help స్వీయ సహాయం
    Complaint Tracking ఫిర్యాదు ట్రాకింగ్
Instant Recharge
Manage your account
Access Control Guide
Quick Fix
Transaction History
Exclusive Offers

మీ డిష్‌టివి ఆండ్రాయిడ్ మొబైల్ యాప్ ఏం చేయగలదు?

తక్షణ రీఛార్జ్
కేవలం నొక్కడం ద్వారా ఎప్పుడైనా, ఎక్కడైనా రీచార్జ్ చేయండి. అనేక చెల్లింపు విధానాలు మరియు అద్భుతమైన ఆఫర్లు.
మీ అకౌంటును నిర్వహించండి
మీ ప్యాక్‌కు మార్పులు చేయండి మరియు కొన్నిసార్లు నొక్కడం ద్వారా మరిన్ని ఛానెల్‌లు/సర్వీసులు చేర్చండి.
ఛానెల్ గైడ్
మీ ఇష్టమైన కార్యక్రమం ఎప్పుడు ప్రసారం అవుతుందో తెలుసుకుని దానికి రిమైండర్లు పెట్టండి. ఛానెల్స్‌ను ఇష్టమైనవిగా సెట్ చేయండి.
క్విక్ ఫిక్సస్
కొత్తగా ప్రారంభించబడిన ఎడిఐ చాట్‌బోట్‌తో My DishTV యాప్‌తో మాట్లాడండి. ఎడిఐకి మీ డిషి టీవీకి సంబంధించిన సమస్యలను చెప్పండి మరియు వెంటనే పరిష్కారాలను పొందండి.
ట్రాన్సాక్షన్ హిస్టరీ
ఇంతకుముందు చేసిన రీచార్జ్ లను చూడండి మరియు ఇన్వాయిస్‌లను డౌన్లోడ్ చేసుకోండి
ఇన్‌ఫ్రేర్డ్ రిమోట్
మీ డిష్ టివి సెట్-టాప్-బాక్స్‌కు సహాయకంగా ఉంటుంది: సరికొత్త ఇన్‌ఫ్రేర్డ్ రిమోట్ ఫీచర్లతో ఇపుడు మీ డిష్ టివిని నియంత్రించండి.

*ఇన్‌ఫ్రేర్డ్ ట్రాన్స్‌మిటర్లు గల పరికరాలకు మాత్రమే. మీ పరికరం తయారీదారునితో పరిశీలించండి.

- ప్రేమ్ రావల్
కొత్తగా అభివృద్ధి చేసిన యాప్…
- ప్రదీప్ కుమార్
చాలా బాగుంది మరియు ఉపయోగించడం సులభంగా ఉన్న యాప్.
- దీపాంకర్ భట్టాచార్య
ఈ యాప్ అసాధారణమైన యాప్‌గా మారింది, రిమోట్ ఫీచర్ చాలా ఉపయోగకరంగా ఉంది. మరింత బాగా చేయండి
- ప్రసాద్ యెల్చూరి
డిష్ టివి సమాచారం అంతా అందుబాటులో. రీఛార్జ్ చేయడం సులభం
- ప్యారీ వాలియా
చాలా మంచి అనువర్తనం, హెల్ప్ కేర్ కేంద్రానికి కాల్ చేయవలసిన అవసరం లేదు మీరు మీ ప్యాక్ ను సవరించుకోవచ్చు, మీ డిష్ రిఫ్రెష్ చేసుకోవచ్చు, తక్షణ రీఛార్జ్ మొదలైనవి, గొప్ప అనువర్తనం
- మండి సంధు
ఈ అనువర్తనం మరింత జనాదరణ పొందుతూ, ఉపయోగకరమైన మరియు సమాచారం కలిగినదిగా తయారవుతోంది. ఛానెల్ గైడ్ యొక్క కొత్త జోడింపు అద్భుతంగా ఉంది.
- షంషేర్ ఠాకూర్
ఒక యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ చక్కని మరియు సమర్థవంతమైనది. శీఘ్ర కస్టమర్ మద్దతు.

తరచుగా అడిగిన ప్రశ్నలు

యాప్ నాకు ఏ విధంగా సహాయపడుతుంది?

మై డిష్ టివి (dishtv) యాప్ 24 x 7 కు మీ డిష్ టివి (dishtv) ఖాతాకు ప్రాప్యతను అందించడం ద్వారా సహాయపడుతుంది. ఖాతా సమాచారం అంతా ఒక ట్యాప్ లోపల మరియు అన్ని ఇతర చర్యలు 3 ట్యాప్ల లోపు అందుబాటులో ఉంటాయి. ఇన్స్టెంట్ రీఛార్జ్, మేనేజ్ అకౌంట్ మరియు ట్రాన్సాక్షన్ హిస్టరీ వంటి లక్షణాలతో, మీరు సాధారణ సమాచారం మరియు సాధారణ సమస్యల కోసం కాల్ చేయవలసిన అవసరం ఉండదు.

యాప్ లో గల వివిధ ఫీచర్లు/సెక్షన్లు ఏమిటి?

యాప్‌కు చెందిన వివిధ సెక్షన్లు/ఫీచర్లు క్రింద పేర్కొనబడినవి:

  • తక్షణ రీఛార్జ్: 3 క్లిక్కులతో రీఛార్జ్, యూపీఐ మరియు వ్యాలెట్స్ లాంటి వివిధ చెల్లింపు విధానాలు ఉపయోగించవచ్చు.
  • ఆది చాట్‌బోట్: రీచార్జ్ చేసిన తర్వాత టివి చూడలేకపోతున్నాను, సబ్‌స్క్రైబ్ చేసిన చానెల్స్ రావడం లేదు మొదలైన సమస్యలకు ఆది చాట్‌బోట్‌తో పరిష్క్రాలు పొందండి. మీ డిష్ టివికి సంబంధించిన సమస్యలను ఆదితో చెప్పండి మరియు తక్షణమే పరిష్కారాలు పొందండి.
  • ఇన్‌ఫ్రేర్డ్ రిమోట్: ఇపుడు ఇన్‌ఫ్రేర్డ్ రిమోట్‌తో మీ My DishTV యాప్‌లో మీరు మీ డిష్ టివి సెట్-టాప్-బాక్స్‌ను నియంత్రించవచ్చు. ఐఆర్ రిమోట్ ఇన్‌ఫ్రేర్డ్ ట్రాన్స్‌మిటర్/బ్లాస్టర్‌తో ఆండ్రాయిడ్ మొబైల్ పరికరాలలో మాత్రమే అందుబాటులో ఉంటుంది.
  • ప్యాక్ ను మార్చుకోవచ్చు: బ్యాలెన్స్, సభ్యత్వం పొందిన ప్యాక్, స్విచ్-ఆఫ్ తేదీల వంటి అకౌంట్ వివరాలను చూడొచ్చు. కొన్ని క్లిక్కులతోనే ప్యాక్ ని అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు, మరికొన్ని ఛానెళ్లను జోడించచ్చు లేదా సర్వీసులని యాక్టివ్ చేసుకోవచ్చు. ప్యాక్ ని సెలెక్ట్ చేసుకోవడానికి/మార్చుకోవటానికి మీ కోసం సులభతరం చేయబడింది.
  • చానెల్ నంబరు తెలుసుకునేది: చానెల్ నంబరు తెలుసుకోవడానికి చానెల్ పేరుతో వెతకండి.
  • చానెల్ గైడ్: డిషి టివి ప్లాట్‌ఫాంపై అన్ని చానెల్స్‌లో కార్యక్రమాల గురించి వివరణాత్మక షెడ్యూల్. కార్యక్రమ షెడ్యూల్ చూడండి, చానెల్స్‌ను ఇష్టమైనవిగా గుర్తించండి మరియు ఆ కార్యక్రమాలకు రిమైండర్లు సెట్ చేయండి. అంతేకాకుండా కార్యక్రమ సమాచారాన్ని మీ స్నేహితులతో పంచుకోండి.
  • ప్రోగ్రాం సిఫారసులు: ఇపుడు My DishTV మీ టివిలో చూడదగిన అత్యంత పాపులర్ కంటెంటును సిఫారసు చేయగలదు. ప్రస్తుతం ప్రసారం అవుతున్న మరియు ఉత్తమ టివి షోలు, సినిమాలు మరియు ఆటల గురించి హోమ్ పేజిపై సమాచారాన్ని చేతికి అందివ్వగలదు.

డిష్‌టీవీ యాప్‌ను ఎవరు ఉపయోగించగలుగుతారు?

డిష్ టివి మరియు జింగ్ డిజిటల్ సబ్‌స్క్రైబర్లకు మాత్రమే యాప్ అందుబాటులో ఉంది.

యాప్ లో నేను ఎలా రిజిస్టర్ అవ్వాలి?

మీ రిజిస్టర్ మొబైల్ నంబరును(ఆర్ఎంఎన్) ఉపయోగించి యాప్ కోసం రిజిస్టర్ అవ్వచ్చు. లాగిన్ పేజీలో "రిజిస్టర్" అని సెలెక్ట్ చేసి, తరువాతి స్క్రీన్లో మీ ఆర్ఎంఎన్ ను నమోదు చేయండి. ఆర్ఎంఎన్ ను ధృవీకరించటానికి ఒక ఓటీపి నంబరు వస్తుంది. ఆ ఓటీపీని నమోదు చేసి, లాగిన్ అవ్వటానికి పాస్‌వర్డ్ ను ఎంచుకోండి.

నేను ఎలా లాగిన్ అవ్వాలి?

మూడు వేర్వేరు విధానాలను ఉపయోగించి యాప్ లాగిన్ అవ్వచ్చు:

  • యాప్ ఆధారాలను ఉపయోగించి మీ ఆర్ఎంఎన్/విసి నెంబర్ని మరియు యాప్ పై రిజిస్ట్రేషన్ సమయంలో మీరు ఎంచుకున్న పాస్వర్డ్ను ఉపయోగించడం. యాప్ కు లాగిన్ అవ్వడానికి www.dishtv.in పై మీ ఖాతా కోసం ఆధారాలను కూడా మీరు ఉపయోగించవచ్చు.
  • ఒటిపి (వన్-టైం-పాస్కోడ్) ను ఉపయోగించి: లాగిన్ పేజీలో "ఒటిపి అభ్యర్థించండి" ఎంపికను ఎంచుకోండి, తర్వాతి పేజీలో మీ ఆర్ఎంఎన్ ను నమోదు చేయండి మరియు మీరు మీ ఆర్ఎంఎన్ పై ఒక ఒటిపిని అందుకుంటారు. ఒటిపిని యాప్ దానంతటఅదే చదువుతుంది, కేవలం సమర్పించండిని తట్టి లాగిన్ అవండి.
  • మీ సోషల్ మీడియా ఖాతాని ఉపయోగించి: కేవలం ఒకే ఒక్కసారి తట్టడంతో లాగిన్ అవడానికి మీరు మీ సోషల్ మీడియా ఖాతా (జిమెయిల్ మరియు ఫేస్బుక్) ను ఉపయోగించుకోవచ్చు. మొదటిసారి ఈ పద్ధతిని ఉపయోగించినప్పుడు మాత్రమే మీరు మీ సోషల్ మీడియా ఖాతా యొక్క ఆధారాలను సమర్పించాలి. మేము మీ సోషల్ మీడియా ఖాతాను మీ డిష్ టివి ఖాతాకు లింక్ చేస్తాము మరియు తదుపరిసారి నుంచి లాగిన్ అవటానికి మీరు మీ ఇష్టపడే సోషల్ మీడియా ఎంపికపై ఒకసారి తట్టండి చాలు.

నాకు ఒకవేళ పాస్‌వర్డ్ గుర్తులేకపోతే ఏమవుతుంది?

లాగిన్ పేజీలో, "పాస్వర్డ్ మర్చిపోయాను" తట్టండి -> మీ ఆర్ఎంఎన్ ను నమోదు చేయండి మరియు మీరు మీ క్రొత్త పాస్వర్డ్తో మీ ఆర్ఎంఎన్ పై ఒక ఎస్ఎంఎస్ మరియు మీ రిజిస్టర్డ్ ఇమెయిల్ ఐడి పై ఒక ఇమెయిల్ కూడా అందుకుంటారు.

ప్రత్యామ్నాయంగా, పైన పేర్కొన్న విధంగా లాగిన్ అవడానికి మీరు ఒటిపి పద్ధతిని కూడా ఉపయోగించవచ్చు.

ఒకే లాగిన్‌తో అన్ని అకౌంట్లను నిర్వహించవచ్చా?

అవును, మీరు లాగిన్ కొరకు rmn ఉపయోగిస్తున్నట్లయితే, లాగింగ్ ఇన్ చేస్తున్నపుడు మిమ్మల్ని vc నంబరు ఉపయోగించమని అడుగుతారు. ఆ ప్రాంప్ట్ పై మీకు కావలసిన ఖాతాకు vc నంబరు ఎంచుకోండి.
మరొక vc నంబరు (అదే మొబైల్ నంబరు కింద రిజిస్టర్ చేసినది) గురించి సమాచారాన్ని చూడడం కోసం, మీ vc నంబర్ల జాబితా చూడడం కోసం హోమ్ పేజిపై కనబడుతున్న vc నంబరుపై నొక్కండి, vc నంబరు సమాచారం చూడడం కోసం దానిపై నొక్కండి.

నేను రీఛార్జి చేయగలిగే వివిధ చెల్లింపు విధానాలు ఏమిటి?

మీరు క్రింది చెల్లింపు మోడ్ల ద్వారా రీఛార్జ్ చేయవచ్చు:

  1. డెబిట్ కార్డు
  2. క్రెడిట్ కార్డ్
  3. నెట్ బ్యాంకింగ్
  4. యూపిఐ
  5. వాలెట్లు
    • పేటిఎం
    • మోబిక్విక్
    మేము మరిన్ని వాలెట్ ఆప్షన్లను జతచేసే ప్రక్రియలో ఉన్నాము.

ఛానల్ గైడ్ ఏ సమాచారాన్ని తెలియజేస్తుంది?

చానెల్ గైడ్ అనేది తర్వాతి 7 రోజులకు డిష్ టివీలో అందుబాటులో గల అన్ని చానెల్‌ల కార్యక్రమాల గురించి సమాచారాన్ని అందిస్తుంది. ఇది ఒక్కొక్క ప్రోగ్రాం గురించి వివరణాత్మక సమాచారాన్ని కూడా అందిస్తుంది.
దీనితో పాటుగా, మీరు చానెల్‌లను ఇష్టమైనవిగా గుర్తించవచ్చు, మీకిష్టమైన కార్యక్రమాలకు రిమైండైర్లు సెట్ చేయవచ్చు మరియు కార్యక్రమ సమాచారాన్ని మీ స్నేహితులతో పంచుకోవచ్చు.

ఒక కార్యక్రమం కోసం నేను రిమైండర్ ను ఎలా సెట్ చేసుకోవాలి?

చానెల్ గైడ్ కు వెళ్లండి -> మీరు వెతుకుతున్న ప్రోగ్రామ్ను కనుగొనటానికి నావిగేట్ చేయండి (మీరు ప్రోగ్రామ్ల కోసం శోధన కూడా చేయవచ్చు) -> ప్రోగ్రామ్ సమాచారం పాప్అప్ ను తెరిచే కావలసిన ప్రోగ్రామ్ పై తట్టండి. పాపప్ కు దిగువన ఒక రిమైండర్ చిహ్నం ఉంది. మీ క్యాలెండర్కు ప్రోగ్రామ్ రిమైండర్ను జోడించడానికి దానిని తట్టండి.

నేను చానెల్‌లను నా ఇష్టమైనవిగా ఎలా గుర్తించవచ్చు మరియు నాకిష్టమైన చానెల్‌ల జాబితాను ఎలా పొందవచ్చు?

చానెల్ గైడ్‌లో ఒక చానెల్‌ను ఇష్టమైనదిగా గుర్తించడానికి/గుర్తు తీసేయడానికి చానెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. మీకు ఇష్టమైనవిగా మీరు గుర్తించిన చానెల్‌ల జాబితా పొందడానికి, ఫిల్టర్స్‌కు వెళ్ళండి, ఫేవరెట్స్ ఎంచుకోండి (ఫిల్టర్ జాబితాలోని మొదటి ఐటమ్) -> అప్లై చేయండి.

ఏ ఆపరేటింగ్ సిస్టమ్స్ తో యాప్ అందుబాటులో దొరుకుతుంది?

ఆండ్రాయిడ్ ఓఎస్ వర్షన్ 4.0 మరియు ఆపై వాటికి యాప్ అందుబాటులో ఉంది.

నేను టీవీ కార్యక్రమాలను యాప్ లో చూడవచ్చా?

ప్రస్తుతం My DishTV యాప్‌లో స్ట్రీమింగ్ ఫీచర్ లేదు. అయితే ప్రస్తుతం వస్తున్న మరియు రాబోయే టివి షోలు, సినిమాలు మరియు స్పోర్ట్స్ గురించి సిఫారసులను హోమ్ పేజిపై డిష్ టివి యాప్ అందిస్తుంది.

ఆది చాట్ బోట్ ను ఉపయోగించడం ఎలా?

ఇపుడు ఆది చాట్ బోట్ మీ ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది మరియు డిష్ టివి సంబంధిత సమస్యలకు పరిష్కారాలను ఇస్తుంది. హోమ్ పేజి యొక్క కుడి పక్కన కింద ఆది ఐకాన్ పై క్లిక్ చేయండి మరియు మీ సమస్యలను సాధారణ చాటింగ్ లాగా టైప్ చేయండి. అక్కడ ఉన్నవి ఎంచుకోవడానికి మీరు ఆది ద్వారా ఇవ్వబడిన వాటి నుండి కూడా ఎంచుకోవచ్చు.

ఇన్‌ఫ్రేర్డ్ రిమోట్ ను ఉపయోగించడం ఎలా?

అంతర్గతంగా ఇన్‌ఫ్రేర్డ్ బ్లాస్టర్ /ట్రాన్స్‌మిటర్ ఉన్న పరికరాలలో మాత్రమే ఇన్‌ఫ్రేర్డ్ రిమోట్ అందుబాటులో ఉంటుంది. ఇలాంటి పరికరాలకు ఉదాహరణ రెడ్‌మి 4/5 మరియు రెడ్‌మి నోట్ 4/5 ఇలాంటి సరైన పరికరం మీ వద్ద ఉంటే కనుక, హోమ్ పేజిపై బాటమ్ నావిగేషన్ యొక్క మధ్యలో ఐఆర్ రిమోట్ ఐకాన్ కనబడుతుంది.
రిమోట్ ను యాక్సెస్ చేయడానికి ఐఆర్ రిమోట్ ఐకాన్ పై నొక్కండి. ఇంటర్‌ఫేస్ స్వీయ-వివరణాత్మకమైనది మరియు మీ డిష్ టీవి రిమోట్ లాగానే ఉంటుంది.
పైకి స్క్రోల్ చేయండి